- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సీఎం రేవంత్ సమీక్ష.. తన నివాసంలో మంత్రులతో సమావేశం
రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అధికారులు, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో (Heavy Rains) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. చాలా గ్రామాల్లో వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సహాయక చర్యలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అధికారులు, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్కతో పాటు తదితర అధికారులు భేటీ అయ్యారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగితా జిల్లాలలోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.






