- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sarpanch election: మీ వల్లే గెలవాల్సిన చోట్ల ఓడిపోయాం.. సర్పంచ్ ఫలితాలపై 18 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీరియస్
సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష నిర్వహించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ను సమన్వయం చేసుకుని వారిని బుజ్జగించడంలో విఫలమైన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మేము ముగ్గురం చర్చించామని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రెబల్స్ ను సమన్వయం చేయలేని, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జులపై అసహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సరిగా పని చేయని 18 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ద్వారా ఈ 18 మంది ఎమ్మెల్యేలు, ఇన్ చార్జీలతో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడి పార్టీకి తీరని నష్టం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 18 మంది ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం, మీనాక్షి అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఇకనైనా వైఖరి మార్చుకుని పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేయాలని ఆదేశించారు.
మీ వల్లే ఓడిపోయాం:
సమీక్షలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ రెబల్స్ విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ప్రతిపక్ష పార్టీలు లాభ పడ్డాయన్న అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమన్వయ లోపం వల్ల గెలవాల్సిన స్థానాల్లో కూడా ఓడిపోయామని ముఖ్యంగా వరంగల్, నల్గొండ, పాలమూరుకు చెందిన నేతలకు మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్నారని సమాచారం. ఇంకోసారి ఇలా రిపీట్ కావొద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెబల్స్ తో సమన్వయ లోపం, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడం వల్లే గెలవాల్సిన చోట్ల పార్టీ విఫలమైందని మండిపడినట్లు సమాచారం.
కాగా ఈ నెల 11, 14, 17 తేదీలలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పల్లెజనం అధికార కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. మూడు విడతల్లో కలిపి కాంగ్రెస్ 7491 స్థానాలు, బీఆర్ఎస్ 3,494, 749 బీజేపీ, ఇతరులు 956 చోట్ల విజయం సాధించారు. ఈ ఫలితాల్లో అధికార పార్టీకి మూడింట రెండొంతుల సీట్లు దక్కించుకోగా మూడింట ఒకటో వంతు బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.
READ MORE ....
నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి






