టోక్యో మెట్రోను సందర్శించిన సీఎం రేవంత్ బృందం

by Ajay Maddhiboyina |

టోక్యో మెట్రోను సందర్శించిన సీఎం రేవంత్ బృందం
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌స్తుతం జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రేవంత్ త‌న బృందంతో క‌లిసి ప్ర‌ఖ్యాత టోక్యో మెట్రోను సంద‌ర్శించారు. టోక్యో మెట్రోను తొమ్మిది లైన్ల‌తో అత్యాధునికంగా నిర్మించారు. దీంతో దాని కార్యాచ‌ర‌ణ‌, సాంకేతిక వినియోగాన్ని తెలంగాణ బృందం పరిశీలించింది. స్థానిక ప్ర‌యాణికుల‌తో పాటూ అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు అత్యంత సౌక‌ర్య‌వంత‌మైన సేవ‌లు అందిస్తున్న విధానాల‌ను ఈ సంద‌ర్భంగా అధ్య‌య‌నం చేసింది.

హైద‌రాబాద్ మెట్రో రెండ‌వ ద‌శ విస్త‌ర‌ణ‌కు సంబంధించిన ప్ర‌నాళిక‌ల‌ను రూపొందించే క్ర‌మంలో ప్ర‌పంచ స్థాయి ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను అధ్య‌య‌నం చేసే క్ర‌మంలో ముఖ్య‌మంత్రి త‌న బృందంతో క‌లిసి టోక్యో మెట్రోను ప‌రిశీలించిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైద‌రాబాద్‌లో రెండో దశ మెట్రో పనులకు ఇప్పటికే ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మొత్తం ఐదు మార్గాల్లో మెట్రో నిర్మాణం జరగనుంది. ఈ దశలో 116.4 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరుగుతోంది. రెండో దశలో 24వేల కోట్ల అంచనాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో రాష్ట్రం 30 శాతం, కేంద్రం 18 శాతం వాటాను కేటాయిస్తున్నాయి.

Next Story