TG: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ

by Prasad Jukanti |   (  Updated:2026-03-22 11:27:55  IST  )

సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన రైతు ఉత్సవాల సభ వేదికగా రైతుభరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

TG: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. ఇవాళ సిద్దిపేట జిల్లా నర్మెట‍లో నిర్వహించిన రైతు ఉత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిరాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కోసం రూ.9వేల కోట్ల ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేశారు. ఈ 9వేల కోట్లు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయబోతోంది. కాగా పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి యేటా రెండు విడతల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ. 12 వేలు రైతులకు ఆర్థిక సాయం అందజేస్తోంది.

కాగా, నిధులు విడుదలకు ముందే సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక సందేశాన్ని పంపారు. 'అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఆర్ధిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదు… కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నాం. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నాం.' అని ఎక్స్ లో పోస్టు చేశారు.

Next Story