CM Revanth: బతుకమ్మ గిన్నిస్ వరల్డ్‌ రికార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. వారికి విషెస్

by Ramesh Naini |

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన అతి పెద్ద బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని, అధికారులను అభినందించారు.

CM Revanth: బతుకమ్మ గిన్నిస్ వరల్డ్‌ రికార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. వారికి విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన అతిపెద్ద (Bathukamma) బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness World Record) సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని, అధికారులను అభినందించారు. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుక అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద సంప్రదాయ నృత్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ నివాసంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం డిపార్ట్మెంట్ ఎండీ క్రాంతి మర్యాదపూర్వకంగా కలిశారు.

బతుకమ్మ కార్యక్రమం, జానపద నృత్యం సాధించిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను (Minister Jupally Krishna Rao) మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు జయేశ్ రంజన్, టూరిజం ఎండీ క్రాంతి కలిసి సీఎంకి అందజేశారు. అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద నృత్యంగా మన సాంస్కృతిక వేడుక, కళా ప్రదర్శనలు గిన్నిస్ రికార్డు సృష్టించడం మనకు గర్వకారణమని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.

Next Story