- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చార్మినార్ అగ్నిప్రమాద ఘటనపై సీఎం ఆరా.. మంత్రి పొన్నంకు ఆదేశాలు
చార్మినార్ అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లాలని మంత్రి పొన్నంను ఆదేశించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం తెల్లవారుజామున చార్మినార్ సమీపంలోని మీర్ చౌక్ లో గుల్బార్ హౌస్ (Gulbar House)లో సంభవించిన అగ్నిప్రమాద (Charminar Fire Accident)ఘటనలో మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. మృతుల్లో నలుగురు చిన్నారులు, ముగ్గురు పురుషులు, మరో ముగ్గురుమహిళలు ఉన్నట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో నాలుగు కుటుంబాలు మంటల్లో చిక్కుకోగా.. అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది 16 మందిని కాపాడారు. వీరిలో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తాజాగా ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy).. బాధిత కుటుంబాలతో మాట్లాడి అగ్నిప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.






