స్వగ్రామానికి సీఎం.. రేవంత్ రెడ్డిపై కొండారెడ్డిపల్లి ప్రజల పూల వర్షం

by Prasad Jukanti |   (  Updated:2025-10-02 11:45:42  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామానికి చేరుకున్నారు.

స్వగ్రామానికి సీఎం.. రేవంత్ రెడ్డిపై కొండారెడ్డిపల్లి ప్రజల పూల వర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో/ మహబూబ్ నగర్ బ్యూరో/ వంగూరు: మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి (Kondareddypally) చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‍లో కొండారెడ్డిపల్లికి చేరుకున్న సీఎంకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. హెలిపాడ్ నుంచి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు ర్యాలీగా వచ్చిన రేవంత్ రెడ్డిపై గ్రామస్థులు పూల వర్షం కురింపించారు. గజమాల వేల స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ సాయంత్రం గ్రామంలో జరిగే శమీ పూజ, దసరా ఉత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు కొండారెడ్డిపల్లి నుంచి కొండగల్ కు వెళ్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో కొండారెడ్డిపల్లిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో స్వగ్రామంలో దసరా వేడుకలు నిర్వహించుకోవడం రేవంత్ రెడ్డికి ఇది రెండో సారి. గతేడాది సీఎంగా మొదటిసారి స్వగ్రామానికి వచ్చి గ్రామ పంచాయతీ భవనం, సోలార్ విద్యుత్ పనులను ప్రారంభించారు.

Next Story