- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: ముగిసిన సీఎం ఢిల్లీ టూర్.. హైదరాబాద్ కు చేరిక
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం దేశ రాజధాని ఢిల్లీ (Delhi Tour) వెళ్లిన ఆయన తన పర్యటన ముగించుకుని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిచారు. సోమవారం కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఖేలో ఇండియా గేమ్స్ ను తెలంగాణలో నిర్వహించాలని, ఒలింపిక్స్-2036 లో 2 ఈవెంట్లు రాష్ట్రంలో జరపాలని కోరారు. ఇదే రోజున సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కలిసి తెలంగాణలో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ తాను భాగస్వామినవుతానని సీఎంతో చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్ గణ్ సీఎంను కలిలి రాష్ట్రంలో ఫిల్మ్ స్టూడియో నిర్మించేందుకు సహకరించాలని కోరారు. మంగళవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్ తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి యూరియా సరఫరా, జహీరాబాద్ స్మార్ట్ సిటీకి నిధులు, వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక చేయుతతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధిపై కీలక విజ్ఞప్తులు చేశారు. ఇవాళ మరికొంత మంది కేంద్ర మంత్రులతో భేటీ అవుతారనే టాక్ వినిపించినా ఎవరిని సీఎం కలవలేదు. ఈక్రమంలో తన పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా సీఎం ఏఐసీసీ పెద్దలెవరిని కలవకుండానే రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు.






