CM Revanth Reddy: బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం.. లైవ్ లోనే అడ్డుతగిలిన బీఆర్ఎస్

by Prasad Jukanti |   (  Updated:2025-06-18 13:36:02  IST  )

బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy: బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం.. లైవ్ లోనే అడ్డుతగిలిన బీఆర్ఎస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు. గోదావరి-బనకచర్ల (Banakacharla Project) లింక్ ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు. గోదావరి-బనకటర్లపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై విపక్షాలతోనూ చర్చించామని బనకచర్లపై ఎంపీలు తమ అభిప్రాయాలు చెప్పారన్నారు. తెలంగాణకు గోదావరి, కృష్ణానదులే జీవనాధారం అని.. రాజకీయ విభేదాలు ఉన్నా, పార్టీలన్నీ దీనిపై కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. అయితే ముఖ్యమంత్రి రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఈ మీడియా సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

మిగులు జలాలు మొదట మాట్లాడింది కేసీఆరే:

2016 లో ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లిలో ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిది. ఈ సమావేశంలో ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీరు వృథాగా గోదావరిలో కలుస్తోందని కేసీఆర్ (KCR) చెప్పారని అన్నారు. 3 వేల టీఎంసీలు వృథాగా పోతున్నాయని మొదట మాట్లాడింది ఆనాటి సీఎం కేసీఆరేనన్నారు. 2019 అక్టోబర్ లో కేసీఆర్, జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించడంపై చర్చించుకున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఆలోచనకు ఆనాడే అంకురార్పణ జరిగిందన్నారు. రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తానని కేసీఆర్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. అపెక్స్ కౌన్సిల్ లో ఎవరేం మాట్లాడారో అంతా దస్త్రాల రూపంలోనే ఉందన్నారు. ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్టు చేపట్టవద్దని తీర్మానం చేద్దామని గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై టెక్నికల్, లీగల్, పొలిటికల్ గా అడ్డుకుంటామని సీఎం చెప్పారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసి మా వాదన వివరిస్తామన్నారు. పొలిటికల్ గా మా ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు.

Next Story