చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడి.. పోలీసులకు CM రేవంత్ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-10 13:06:50  IST  )

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకుడు రంగరాజన్‌(Rangarajan)పై దాడి జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు.

చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడి.. పోలీసులకు CM రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకుడు రంగరాజన్‌(Rangarajan)పై దాడి జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. సోమవారం సాయంత్రం అర్చకులు రంగరాజన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. ఇలాంటి దాడులను సహించేది లేదని.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతకుముందు ఈ దాడి ఘటనను మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తీవ్రంగా ఖండించారు. రామ రాజ్యం పేరుతో దాడులు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.

ఇది హేయమైన చర్య అని సీరియస్ అయ్యారు. రామరాజ్యం పేరుతో రౌడీయిజం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. రాముడి పేరును బద్నామ్ చేస్తూ అరాచక, అనాగరిక కార్యక్రమాలకు పాల్పడటం దుర్మార్గమని అన్నారు. ఇది క్షమించరాని నేరం అని.. అంతేకాదు రాముడి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే చర్యగా పేర్కొన్నారు. మరోవైపు దాడి కేసుకు సంబంధించి ఆదివారం ఒకరిని అరెస్టు చేసినట్టు మొయినాబాద్‌ పోలీసులు తెలిపారు. మొత్తం 20 మందికిపైగా దాడికి పాల్పడగా.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

Next Story