CM Revanth Reddy : తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి

by Muthe.Rajitha |

తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ(Bhagya Reddy Varma) జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయనకు నివాళులు అర్పించారు.

CM Revanth Reddy : తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ(Bhagya Reddy Varma) జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయనకు నివాళులు అర్పించారు. సమాజంలో వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన దీన జన బాంధవుడు, సంఘ సంస్కర్త, తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించారు. వివక్షలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన యోధుడు, బాలికల అభ్యున్నతి కోసం పాటు పడిన మహనీయుడు, ఆది ఆంధ్ర సభ(Adi Andhra Sabha) స్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ అని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు.

భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మాదరి భాగ్యయ్య. హైదరాబాద్ రాష్ట్రంలో దళిత ఉద్యమ పితామహుడిగా పిలవబడే సామాజిక సంస్కర్త. రాజకీయ నాయకుడు. మాల కులంలో జన్మించి అస్పృశ్యత, జోగిని, దేవదాసి వ్యవస్థలను రూపుమాపేందుకు జీవితాంతం పోరాడారు. 1912లో ఆది-హిందూ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1924లో ఆది-హిందూ సామాజిక సేవా సంఘాన్ని స్థాపించారు. బి.ఆర్. అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో దళితులకు విద్య, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారు. 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించి హరికథల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారు.

1910 నుంచి 25 విద్యా కేంద్రాలతో 2,000 మంది దళిత బిడ్డలకు చదువు చెప్పారు. 1913లో హైదరాబాద్‌లో భాగ్య మెమోరియల్ గర్ల్స్ హైస్కూల్‌ను స్థాపించారు. బాల్య వివాహాలు, మద్యపానంకు వ్యతిరేకంగా పోరాడారు. దేవదాసి వ్యవస్థ నిషేధానికి నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించారు. 1931లో దళితులను ఆది-హిందువులుగా ఎన్నికల్లో నమోదు చేయించారు. నిజాం ఒస్మాన్ అలీ ఖాన్ ఆయన సేవలను గౌరవించి అవార్డు, సలహాదారు పదవి ఇచ్చారు. 1913లో ఆర్య సమాజ్ "వర్మ" బిరుదు ఇచ్చింది. ఆయనను "ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ పితామహుడు"గా గౌరవిస్తారు.

Next Story