- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: వృక్షమాత తిమ్మక్కకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి
ప్రఖ్యాత పర్యావరణవేత్త, వృక్షమాత, పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రఖ్యాత పర్యావరణవేత్త, వృక్షమాత, పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క (Saalumarada Thimmakka) మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసి వేలాది మొక్కలను నాటి, దేశవ్యాప్తంగా చెట్ల పెంపకం ఉద్యమానికి అలుపెరగని సేవలు అందించిన తిమ్మక్కను సమాజం ఎప్పటికీ మరిచిపోలేదని సీఎం పేర్కొన్నారు.
తిమ్మక్క నిస్వార్థ సేవలు పర్యావరణ పరిరక్షణకు మాత్రమే కాకుండా, అటవీ సంపదను పెంపొందించడానికి దేశంలోని అనేక మందికి స్ఫూర్తిగా నిలిచాయని ఆయన గుర్తుచేశారు. చెట్ల నాటకం మాత్రమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆమె చురుకుగా పాల్గొన్నారని చెప్పారు. తిమ్మక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులు, అభిమానులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి తిమ్మక్కకు నివాళులు అర్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.






