- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి..
భారత మాజీ రాష్ట్రపతి 'భారతరత్న' జాకీర్ హుస్సేన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: భారత మాజీ రాష్ట్రపతి 'భారతరత్న' జాకీర్ హుస్సేన్ (Zakir Hussain) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ మేరకు సీఎం రేవంత్ బృందం శనివారం జాకీర్ హుస్సేన్‌కు నివాళి అర్పించిన వివరాలను ఎక్స్ వేదికగా సీఎంవో ఆఫీస్ వెల్లడించింది. స్వాతంత్య్ర సమర యోధుడిగా, దేశంలో విద్యా రంగం అభివృద్ధికి గొప్ప కృషి చేసిన విద్యావేత్తగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నో సేవలు అందించారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
Next Story






