- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : మాజీ పీసీసీ అధ్యక్షుడు మల్లు అనంత రాములుకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు
ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు మల్లు అనంత రాములు(Former PCC President Mallu Anantha Ramulu) వర్ధంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు మల్లు అనంత రాములు(Former PCC President Mallu Anantha Ramulu) వర్ధంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయనకు ఘన నివాళులు అర్పించారు. నేడు గాంధీభవన్ లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Cheif Mahesh Kumar Goud), తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ(Deepa Das Munshi), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy) కూడా అనంత రాములు చిత్రపటానికి పువ్వులు వేసి నివాళులు అర్పించారు.
గ్రామ అభివృద్ధి అధికారి నుంచి.. ఇందిరాగాంధీ(Indira Gandhi), రాజీవ్ గాంధీ(Rajeev Gandhi)కి అత్యంత సన్నిహితుడిగా ఎదిగిన ఆయన తీరు గర్వకారణం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1943 లో ఖమ్మం(Khammam) జిల్లా వైరా(Viara) మండలం, లక్ష్మిపురం గ్రామంలో జన్మించిన అనంత రాములు.. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతలైన మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), మల్లు రవి(Mallu Ravi)ల సోదరుడు. మొదట గ్రామ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు చేపట్టి.. గ్రామ అభివృద్ది ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి.. రెండు సార్లు లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
ఇందిరాగాంధీ నాయకత్వంలో పార్లమెంటరీ కమిటీలో ప్రతినిధిగా రెండుసార్లు విదేశాలకు పంపబడ్డారు. రాజీవ్ గాంధీ పాలనలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా నామినేట్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షునిగా కూడా పని చేసిన అనంత రాములు 1990 ఫిబ్రవరి 7న గుండెపోటుతో మరణించారు.






