- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: శిబూ సోరెన్‌కి సీఎం రేవంత్ రెడ్డి నివాళి.. కుటుంబ సభ్యులకు ఓదార్పు
దివంగత మాజీ సీఎం శిబూ సోరెన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత మాజీ సీఎం శిబూ సోరెన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాళులు అర్పించారు. (Jharkhand) జార్ఖండ్ రాష్ట్రం రామ్‌గఢ్ జిల్లాలోని నెమ్రా గ్రామంలో గురువారం దివంగత జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ (Shibu Soren) సంస్మరణ సభలో ఆయన పాల్గొని నివాళులు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren), భార్య ఎమ్మెల్యే కల్పనా సోరెన్ (Kalpana Soren), కుటుంబ సభ్యులను కలిసి ఆయన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సీఎం రేవంత్ రెడ్డి కాసేపు మాట్లాడారు.
కాగా, ఈ నెల 4న జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన జూన్ చివరి వారంలో ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఈ నెల 4న ఉదయం 8:56 నిమిషాలకు శిబూ సోరెన్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.






