CM Revanth: పెన్షన్లకు ఆద్యుడు.. సంజీవయ్యకు నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

by Ramesh Naini |

దేశంలో తొలి దళిత సీఎం స్వర్గీయ దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.

CM Revanth: పెన్షన్లకు ఆద్యుడు.. సంజీవయ్యకు నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో తొలి దళిత సీఎం స్వర్గీయ దామోదరం సంజీవయ్య (Damodaram Sanjeevaiah) జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘన నివాళులు అర్పించారు. శుక్రవారం తన నివాసంలో దామోదరం సంజీవయ్య జయంతి (Birth Anniversary) నేపథ్యంలో ఆ మహనీయుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. నిజాయితీకి నిలువెత్తు రూపం, దళిత జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపమని కొనియాడారు.

స్వాతంత్య్ర సమరయోధుడు, దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి, పరిపాలనలో మేటి, వృద్ధులు, వికలాంగుల సంక్షేమ పెన్షన్‌లకు ఆద్యుడు అని సీఎం రేవంత్ రెడ్డి ఓ సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు వివరాలను తెలంగాణ సీఎంవో అధికారిక ఖాతా ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇక, సంజీవయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన వారిలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్‌లు పటేల్ రమేశ్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యులు చారగొండ వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Next Story