తెలంగాణ సాహిత్యానికి వన్నె తెచ్చిన మహాకవి.. సినారెకి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

by Ramesh Naini |

తెలుగు సాహితీవేత్త, సినారెగా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి జయంతి నేడు.

తెలంగాణ సాహిత్యానికి వన్నె తెచ్చిన మహాకవి.. సినారెకి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు సాహితీవేత్త, సినారెగా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (C Narayana Reddy) జయంతి నేడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజకీయ నాయకులు, ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సాహిత్యానికి వన్నె తెచ్చిన మహాకవి, సారస్వత శిఖరం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య సి. నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. గేయ రచయితగా, నవలాకారుడిగా, పద్యకవిగా సాహిత్య రంగంలోనే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా వారు అనేక సామాజిక సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు.

అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. కవితలు, పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, గజల్‌లు, వ్యాసాలు, సినిమా పాటలు.. రూపం ఏదైనా సినారె కలానికి తిరుగు లేదన్నారు. కవి, సాహితీవేత్త, పరిశోధకుడు, అధ్యాపకుడు, సినీ గేయ రచయిత.. పాత్ర ఏదైనా సినారె ప్రతిభకు సాటి లేదన్నారు. ప్రపంచ సాహితీ లోకానికి మన తెలంగాణ గడ్డ అందించిన ఆణిముత్యం సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె), తన పాండిత్యంతో తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన సినారె.. తెలుగు సాహితీ వినీలాకాశంలో ఒక ధృవతార అని కొనియాడారు. తన రచనలతో తెలుగు చలనచిత్ర రంగంలో సరికొత్త బాణీని సృష్టించిన సినారె పాటల పూదోట అని గుర్తు చేసుకున్నారు. జ్ఞానపీఠ్ అవార్డుతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వారిని వరించినా, రాజ్యసభ ఎంపీతో పాటు ఎన్నో గొప్ప పదవులను వారు అలకరించినా.. ఇవన్నీ సినారె సాహితీ సేవ ముందు దిగదుడుపే అని పేర్కొన్నారు.

Next Story