- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సూర్యాపేట మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి (Ramreddy Damodar Reddy) ఈ నెల 1న రాత్రి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ప్రజల సందర్శనార్థం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో పార్థీవ దేహాన్ని ఉంచారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యే అక్కడకు చేరుకుని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్కడకు చేసుకొని రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి.. నివాళులు అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీతో పాటు నల్గొండ జిల్లా ప్రజలకు తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతకు ముందు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి నివాళులు అర్పించారు. అలాగే రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అర్పించించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని.. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వీడలేదని గుర్తు చేసుకున్నారు.






