- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: ఫస్ట్ బ్లేమ్ అయ్యేది పోలీస్ వ్యవస్థే
ఆర్‌బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో "తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ - 2026" కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో "తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ - 2026" కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉటుంది. ఎంత బాగా పనిచేసినా ఈ వ్యవస్థలో మొదటగా బ్లేమ్ అయ్యేది పోలీసులే అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ముందుగా సమస్యలను అర్థం చేసుకోవాలని సూచించారు. సమస్య అర్థమైతే సగం సమస్యను పరిష్కారం లభించినట్లే అని తెలిపారు. దేశంలో బెంగళూరు అద్భుతమైన నగరం.. కానీ ట్రాఫిక్ కష్టాలు బెంగళూరును ఇబ్బంది పెడుతున్నాయి. ముంబై, చెన్నై నగరాలు వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. ఇక కోల్‌కతా గురించి చెప్పే అవసరమే లేదు. వీటన్నింటితో పోలీస్తే మనం చాలా బెటర్ ప్లేస్‌లో ఉన్నామని అన్నారు.
ఈరిట్రీట్లో భాగంగా "ఫ్యూచర్ రెడీ పోలీసింగ్"పై దృష్టి సారిస్తూ.. డీప్‌ఫేక్‌లు, వాయిస్ క్లోనింగ్, ఏఐ (AI) ఆధారిత ఫిషింగ్ మోసాలు వంటి ఆధునిక ముప్పులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, ప్రజా భద్రత, అంతర్గత భద్రతకు సంబంధించిన కొత్త సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే విధానాలపై చర్చించారు.






