- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదు: రేవంత్ రెడ్డి
జీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలనివాళులను సీఎం రేవంత్ రెడ్డి అర్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదని, తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి లోక్‍సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. భారతరత్న, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఈ దేశంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు.
తెలంగాణ ఉన్నంతవరకు గుర్తుచేసుకుంటారు:
దేశానికి సాంకేతికను పరిచయం చేసి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని, దేశంలోసాంకేతికతను తీసుకువచ్చారని సరళీకృత విధానాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళిన గొప్ప దార్శనికుడు అన్నారు. తెలంగాణకు గాంధీ కుటుంబంతో అవినాభావ సంబంధం ఉందని అది కుటుంబ సంబంధం కంటే ఎక్కువ అన్నారు. సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయంతోనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. తెలంగాణ ఉన్నంతవరకు ప్రజలు గాంధీ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటారని . రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు.
మహిళలకు రేవంత్ సర్కార్ కానుకలు.. మే 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు..






