Hyderabad Rain: ఈ రాత్రి జాగ్రత్త

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-07 17:15:15  IST  )

హైదరాబాద్‌ వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం(Heavy Rains) పడుతోంది.

Hyderabad Rain: ఈ రాత్రి జాగ్రత్త
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం(Heavy Rains) పడుతోంది. ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ఇవాళ వర్షాపాతం నమోదైంది. దీంతో నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఒకవైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలో మీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ రాత్రి అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌తో పాటు మిగతా ప్రాంతాల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. సీఎస్, డీజీపీ, జీహెచ్‌ఎంసీ, హైడ్రా, విద్యుత్ విభాగం అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని సూచించారు. రానున్న రెండు రోజులు వ‌ర్షాలు ఉంటాయ‌ని వాతావరణ శాఖ సూచనలున్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.

READ MORE .....

పంజాగుట్ట to అమీర్పేట్.. 2 గంటల జర్నీ.. వాహనదారులకు చుక్కలే

Next Story