రాష్ట్రంలో 15 రోజుల్లో మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేయాలి : సీఎం రేవంత్​రెడ్డి

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో మొక్కజొన్న పంటను 15 రోజుల్లోగా సేకరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్​రెడ్డి అధికారులకు ఆదేశించారు.

రాష్ట్రంలో 15 రోజుల్లో మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేయాలి : సీఎం రేవంత్​రెడ్డి
X
  • గోదాములకు తరలించేందుకు రవాణా, హామాలీ, గోనె సంచులు అందుబాటులో ఉండాలి
  • రోజుకు సగటున 50 వేల మెట్రిక్​టన్నులు కొనుగోలు చేపట్టాలి
  • రైతు పండించిన ప్రతి గింజను అధికారులు తూకం వేయాలి

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మొక్కజొన్న పంటను 15 రోజుల్లోగా సేకరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్​రెడ్డి అధికారులకు ఆదేశించారు. రైతులు పండించి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే నాణ్యమైన ప్రతి మొక్కజొన్న గింజను సేకరించాలి. రవాణా చేసేందుకు తగిన వాహనాలు, హమాలీలు, గోనె సంచులు, నిల్వ స్థలం అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పేర్కొంటూ ప్రతి సేకరణ కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించాలి. వర్షం నుండి పంటను కాపాడి రోజువారీ కొనుగోలు నివేదికలను సమర్పించాలి. వాహనాలు, లాజిస్టిక్స్ సహాయం అందించడంలో విఫలమైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మొన్నటివరకు అధికారులు రాష్ట్రంలో రోజు సగటున 40 వేల నుంచి 45 వేల మెట్రిక్​టన్నుల మొక్కజొన్న సేకరణ చేశారు. ఇప్పటివరకు 9.87 మెట్రిక్​టన్నులు కొనుగోలు చేయగా, గోదాముల్లో 4.93 లక్షల మెట్రిక్​టన్నులు నిల్వ సామర్ధ్యం ఉంది. ఇక నుంచి రోజువారీగా 50 వేల మెట్రిక్​టన్నులు కొనుగోలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొనుగోలు చేసిన పంటను నిల్వలు 11,67 లక్షల మెట్రిక్​టన్నులు కాగా గతం కంటే అదనపు నిల్వలు 1.80 లక్షల మెట్రిక్​టన్నులు పెరిగింది. గోదాముల్లో నిల్వచేయబడిన పరిమాణం 4.93 లక్షల మెట్రిక్​టన్నుల నుంచి 6.50 లక్షల మెట్రిక్​టన్నులకు చేశారు. సరఫరాదారుల ద్వారా రవాణా పెరగడంతో గోనె సంచుల సరఫరా కూడా గణనీయంగా పెంపు జరిగింది. హ్యాండ్లింగ్, రవాణా కాంట్రాక్టర్లతో సమన్వయంతో గోదాము పాయింట్ల వద్ద హమాలీ ఏర్పాట్లు బలోపేతం చేశారు. రవాణా శాఖ సహకారంతో వాహనాలను సమీకరించడం, జిల్లా సరిహద్దుల్లో పర్యవేక్షక అధికారులను నియమించడం ద్వారా వాహనాల కొరత గణనీయంగా తగ్గింది. అర్హులైన రైతులందరూ ఎలాంటి అసౌకర్యం లేకుండా తమ మొక్కజొన్నను కనీస మద్దతు ధరకు అమ్ముకునేలా జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ కొనుగోలు కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ప్రతి అర్హుడైన రైతు తన పంటకు కనీస మద్దతు ధరను పొందేలా, సజావుగా, వేగంగా కొనుగోలు జరిగేలా చూసేందుకు ప్రభుత్వం, టీజీ మార్క్‌ఫెడ్ పనిచేయనున్నాయి.

Next Story