- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమెకు వెంటనే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వండి.. అధికారులకు CM రేవంత్ ఆదేశం
కాలిన గాయాలతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైన సలీమా(Saleema)ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాలిన గాయాలతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైన సలీమా(Saleema)ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. తక్షణమే ఆమెకు తగిన వైద్య సహాయం అందించడంతో పాటు దివ్యాంగుల పింఛను, ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేయాలని సూచించారు. వంట చేసుకుని తినే పరిస్థితి లేకపోవడంతో ఆమెకు భోజనం సదుపాయం కల్పించాలని స్పష్టం చేశారు.
సూర్యాపేట(Suryapet) జిల్లా నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామానికి చెందిన సలీమా దీన స్థితి పైన ఓ పత్రికలో వచ్చిన కథనంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూర్యాపేట జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. కాలిన గాయాల కారణంగా సలీమా నరాలు దెబ్బతినడంతో ఆమె మంచానికే పరిమితమయ్యారు. దీంతో సలీమా పదేళ్ల కుమార్తె రిజ్వాన తల్లి సపర్యలు చేస్తోంది. ఒక వైపు తల్లి బాధ్యతలు చూసుకుంటూనే బడికి వెళ్లి చదువుకోవడం అందరి మనస్సు కదిలించింది. తాజాగా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.






