పాలమూరు-రంగారెడ్డిని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి

by velandi.Saikiran |

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

పాలమూరు-రంగారెడ్డిని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి
X

పాలమూరు-రంగారెడ్డిని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి

- ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ భూసేకరణ కంప్లీట్ చేయాలి

- నిధుల చెల్లింపుల్లో జాప్యం జరగకూడదు

- ఉమ్మడి మహబూబ్‌నగర్ నేతల సమావేశంలో సీఎం రేవంత్‌

దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఎంసీఆర్‌‌హెచ్‌ఆర్‌డీలో సమావేశమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కీలక సూచనలు చేశారు. దీంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, టి.మేఘారెడ్డి, కె.రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పాల్గొన్నారు.

Next Story