- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొస్తాం : సీఎం రేవంత్రెడ్డి
చేనేత రంగానికి, నేతన్నల కుటుంబాలకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని

X
దిశ, తెలంగాణ బ్యూరో : చేనేత రంగానికి, నేతన్నల కుటుంబాలకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదో, అంతే ప్రాధాన్యత నేతన్నలకు ఇస్తున్నదని చెప్పారు.
చేనేత కార్మికుల పాత బకాయిలు విడుదల చేయడంతో పాటు, చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయడం జరిగిందని చెప్పారు. చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ చేనేత అభయ హస్తం పథకం, తెలంగాణ నేతన్న పొదుపు , నేతన్న బీమా, తెలంగాణ నేతన్నకు భరోసా వంటి వినూత్న కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని వెల్లడించారు.
Next Story






