Chikitha wins gold: ‘చికిత’ దేశానికే గర్వకారణం.. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత విషెస్

by Ramesh Naini |

కెనడాలో జరుగుతున్న ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత తానిపర్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

Chikitha wins gold: ‘చికిత’ దేశానికే గర్వకారణం.. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Archery Youth Championship) కెనడాలో జరుగుతున్న ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన (Chikitha Taniparthi) చికిత తానిపర్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం సీఎంవో ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్చరీ అండర్ 21 కేటగిరీ ఫైనల్‌లో కొరియాకు చెందిన పార్క్ యెరిన్‌పై విజయం సాధించి స్వర్ణం చేజిక్కించుకుని చికిత వరల్డ్ చాంపియన్‌గా నిలవడం దేశానికే గర్వకారణమని సీఎం తెలిపారు.

ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, లక్ష్యాన్ని సాధించాలన్న చికిత సంకల్పం యువతీ యువకులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆటుపోట్లను తట్టుకుంటూ గ్రామీణ ప్రాంతం నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్చరీలో రాణించిన చికిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. చిన్ననాటి నుంచి చికితలోని ప్రతిభను గుర్తించి అందుకు అనుగుణంగా ప్రోత్సహించిన తల్లిదండ్రులకు సీఎం అభినందనలు తెలియజేశారు.

అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) క్రీడాకారిణి చికితకు మంగళవారం ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచ క్రీడా వేదికపై భారత దేశ ప్రతిష్టను, తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పిందని కవిత కొనియడారు. సుల్తాన్ పూర్ గ్రామం నుంచి ప్రపంచ స్థాయి పోటీల్లో దేశానికి మొట్టమొదటి బంగారు పతకాన్ని అందించిన చికిత ఎందరో ఆడబిడ్డలకు స్పూర్తిగా నిలిచారని తెలిపారు. భవిష్యత్ లో చికిత మరెన్నో బంగారు పతకాలు సాధించి మనందరికీ గర్వకారణం గా నిలవాలని ఆకాంక్షించారు.

Next Story