పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో CM రేవంత్ భేటీ.. ఒక ఎమ్మెల్యే మిస్

by Gantepaka Srikanth |

పార్టీ ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో CM రేవంత్ భేటీ.. ఒక ఎమ్మెల్యే మిస్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అయితే.. ఈ సమావేశంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మిస్ అయినట్లు సమాచారం. కాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌కుమార్ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినందున వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ శాసనసభ పక్షం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. వీరిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఇప్పటికే వివరణ ఇచ్చారు. మిలిగిన వారు స్పీకర్ నోటీసులపై స్పందించలేదు.. స్పీకర్‌కు వివరణ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారితో అనూహ్యంగా సీఎం రేవంత్ సమావేశం కావడం హాట్ టాపిక్‌గా మారింది.

కాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల) , అరెకపుడి గాంధీ (శేరిలింగంపల్లి), పోచారం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి (బాన్సువాడ) గూడెం మహిపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి (పఠాన్ చెరు) సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవేళ్ల), ప్రకాశ్‌‌‌‌‌‌‌‌గౌడ్ (రాజేంద్రనగర్) ఉన్నారు.

Next Story