- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌కు 800 EV బస్సులు కేటాయించండి.. కుమారస్వామికి CM రేవంత్ రిక్వెస్ట్
హైదరాబాద్ నగరానికి మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు(EV) కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy)కి విజ్ఞప్తి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరానికి మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు(EV) కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy)కి విజ్ఞప్తి చేశారు. శనివారం నీతి ఆయోగ్ సమావేశం అనంతరం.. ఢిల్లీలో కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఇటీవల హైదరాబాద్‌కు 2 వేల ఈవీ బస్సులు(Electronic Buses) కేటాయించారని, ప్రస్తుత నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని పీఎం-ఈ డ్రైవ్ పథకం కింద అదనంగా మరో 800 బస్సులు కేటాయించాలని కోరారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లు బస్సు నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సుకు రెట్రోఫిట్టెడ్ చేపట్టగా అది సఫలమైందని, ఆ బస్సు నగరంలో రాకపోకలు సాగిస్తోందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్‌మెంట్ అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.






