సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి సీతక్క సహా ఎస్టీ నియోజక వర్గాల ఎమ్మెల్యేల భేటీ

by Ramesh Goud |

ఎస్టీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు(ST constiency MLAs), ఎంపీ(MP)తో కలిసి మంత్రి సీతక్క (Minister seethakka), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM R\evanth Reddy)తో భేటీ(Meeting) అయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి సీతక్క సహా ఎస్టీ నియోజక వర్గాల ఎమ్మెల్యేల భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఎస్టీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు(ST constiency MLAs), ఎంపీ(MP)తో కలిసి మంత్రి సీతక్క (Minister seethakka), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM R-evanth Reddy)తో భేటీ(Meeting) అయ్యారు. ఈ సందర్భంగా సీఎం (CM)కు పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎంను కోరారు. అంతేగాక ఆదివాసీ ప్రాంతాల్లో రహదారులు, ఇందిరమ్మ ఇళ్లు, బోరుబావులు, విద్యుత్తు, పోడుభూముల సమస్యలను పరిష్కరించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ కార్యక్రమంలో సీతక్కతో పాటు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ (MP Porika Balaram naik) తో పాటు ఆదివాసీ, గిరిజన నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ విషయాన్ని మంత్రి సీతక్క ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సమావేశంపై ఆమె.. ఆదివాసీ మరియు గిరిజనుల సంక్షేమం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఎస్టీ నియోజక వర్గాల ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, ఎస్టీ ఎమ్మెల్యేల సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను సీఎంకి వివరించామని తెలిపారు. అలాగే గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, విద్యా, ఆరోగ్య రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం సహకారం కోరామని అన్నారు. దీనికై ముఖ్యమంత్రి సుముఖంగా స్పందించారని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

కాగా అంతకుముందు మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంత్రి సీతక్క నేతృత్వంలో ఎస్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. గిరిజన సంక్షేమాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. గత పది సంవత్సరాల్లో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, గత ప్రభుత్వం పోడు సమస్యలను పట్టించుకోలేదని, ఐటీడీఏలను బలహీనపరిచిందని అన్నారు. ఇక ఇందిరా జలప్రభ వంటి పథకాలకు నీళ్లు కేటాయించకుండా నిర్వీర్యం చేసిందని, 10ఏళ్లలో ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పారు. గిరిజన ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, సమావేశంలో ఎస్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డికి నివేదిస్తామని తెలిపారు.

Next Story