CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మేడారం టూర్ ఖరారు

by Prasad Jukanti |   (  Updated:2025-09-11 07:08:51  IST  )

సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించబోతున్నారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మేడారం టూర్ ఖరారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మేడారానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మేడారంలో (Medaram) పర్యటించబోతున్నారు. ఈ నెల 13 లేదా 14న సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించి అక్కడ గద్దెల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. మహా జాతర సమయానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రానున్న 100 రోజుల్లోగా మేడారం అభివృద్ధి పనులు పూర్తి కావాలని అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిల్వ ఉండేలా చెక్ డ్యామ్ ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వారంలో తానే స్వయంగా మేడారంలో పర్యటించి క్షేత్రస్థాయి పనులను పరిశీలిస్తానని చెప్పారు. ఈ మేరకు సీఎం మేడారం టూర్ ఖరారు అయినట్లు సమాచారం.

Next Story