- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు కూడా అపాయింట్మెంట్ ఇస్తా: సీఎం రేవంత్
బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని అన్నారు. దేశానికి బీజేపీ ప్రమాదకరంగా మారిందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై లోక్‌సభ ఎన్నికలకు రాబోతున్నాయని.. వీరి కుట్రను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర హక్కులు నెరవేరుతాయని పేర్కొన్నారు.
నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ఎప్పుడైనా తనను కలవొచ్చని సూచించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా నా అపాయింట్మెంట్ కోరవచ్చు అని కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల సమస్యలు అందరం కలిసి పరిష్కారం చేసుకుందామని చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్ చిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాట్లాడేదేమిటి..? నేను వినేదేమిటి? అని మండిపడ్డారు.
Read More..






