కేరళకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొద్దిసేపటి క్రితం కేరళకు పయనమయ్యారు.

కేరళకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కొద్దిసేపటి క్రితం కేరళకు పయనమయ్యారు. బుధవారం వయనాడ్(Wayanad) లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి వయనాడ్ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్, అమేథీ.. రెండు చోట్లా ఎంపీగా గెలిచారు. నిబంధనల ప్రకారం ఏదైనా ఒక్కచోటు నుంచి మాత్రమే ఎంపీగా కొనసాగాల్సి ఉండటంతో వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామా చేశారు. ఈ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటించగా.. కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. రేపు వయనాడ్ స్థానానికి ప్రియాంక నామినేషన్ వేయనుండగా.. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

Next Story