ఆయన జీవన ప్రస్థానమే 'ఉద్యమశిల్పి' పుస్తకం: CM రేవంత్

by Gantepaka Srikanth |

ప్రముఖ శిల్పి, కళాకారుడు ఎం.వీ. రమణారెడ్డి కళాత్మక జీవన ప్రస్థానం 'ఉద్యమశిల్పి' పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

ఆయన జీవన ప్రస్థానమే ఉద్యమశిల్పి పుస్తకం: CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ శిల్పి, కళాకారుడు ఎం.వీ. రమణారెడ్డి కళాత్మక జీవన ప్రస్థానం 'ఉద్యమశిల్పి' పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ మధ్యతరగతి రైతు కుటుంబం నుండి మొదలైన ప్రఖ్యాత కళాకారుడు రమణారెడ్డి జీవన ప్రస్థానమే 'ఉద్యమశిల్పి' పుస్తకం అని అన్నారు. ఆయన ప్రస్థానం ఖండాంతరాలు దాటి, తెలంగాణ ఉద్యమంతో మమేకమై, ఉద్యమంలో ఒక కళాకారుడిగా తనదైన కీలక పాత్ర వహించిన రమణారెడ్డి, తన జర్మనీ పౌరసత్వాన్ని కూడా వదులుకొని తన ప్రాంత కళారంగంకోసం శ్రమించడం అభినందనీయమని డాక్టర్ జి.చిన్నారెడ్డి ప్రశంశించారు. రమణారెడ్డి కళారంగంలో నిర్వహించిన విశిష్ట కృషిని ముఖ్యమంత్రి ఎంతో కొనియాడారు. రమణారెడ్డి రూపొందించిన ప్రతిష్టాత్మక కళాకృతులు అమరవీరుల స్మారకం (అమరజ్యోతి), సెక్రటేరియట్ ఆవరణలో ఉన్న తెలంగాణతల్లి, రాజీవ్ గాంధీ విగ్రహలు మరియు ఎన్నో కళాకృతులు రమణారెడ్డి రూపొందించినవే అని గుర్తుచేశారు. కాగా, ఈ పుస్తకాన్ని సీనియర్ పాత్రికేయడు వున్నా కృష్ణమూర్తి రాశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి.చిన్నారెడ్డి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ మరియు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story