SPCA: పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ‘ఎస్పీసీఏ’ ప్రత్యేక వెబ్ సైట్‌, లోగో.. ఆవిష్కరించిన సీఎం రేవంత్

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లెయింట్ అథారిటీ (SPCA)కి సంబంధించి రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్‌ను, లోగోను ఆవిష్కరించారు.

SPCA: పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ‘ఎస్పీసీఏ’ ప్రత్యేక వెబ్ సైట్‌, లోగో.. ఆవిష్కరించిన సీఎం రేవంత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లెయింట్ అథారిటీ (SPCA)కి సంబంధించి రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్‌ను, లోగోను ఆవిష్కరించారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో “తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ( SPCA)” వెబ్ సైట్‌, లోగోను సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్, CGG DG రవి గుప్త, ఇంటలిజెన్స్ ADG విజయ్ కుమార్, SPCA చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ శివ శంకర్ రావుతో పాటు ఇతర సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story