- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District)లో పర్యటిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District)లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండలంలో 66 వేల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించబోతున్న గంధమల్ల రిజర్వాయర్(Gandhamalla Reservoir) కు శంకు స్థాపన చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండలాఫీసు, పోలీస్ స్టేషన్ భవనాలకు కూడా శంకు స్థాపన చేశారు.
ఆలేరు నియోజకవర్గంలో మొత్తం రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. మరికాసేపట్లో తుర్కపల్లి(Turkapalli)లోని తిర్మలాపూర్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలో ఇందిరమ్మ ఇళ్ళు, మహిళలకు సోలార్ యూనిట్లు వంటి పలు సంక్షేమ పథకాల లబ్దిదారులకు వాటి పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు.






