- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆగ్రహం (CM serious on ministers)వ్యక్తం చేశారు. జిల్లాల ఇంచార్జ్ మంత్రులు సరైన రీతిలో దృష్టి పెట్టడం లేదని ఇది సరైంది కాదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇంచార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు. నిధులు.. బాధ్యతలన్నీ మీ దగ్గరే ఉన్నాయిన్నాయని చెప్పారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండంటే ఎందుకు పట్టించుకోవడం లేదని వెంటనే జిల్లాల్లో పదవులు భర్తీ చేయాలని ఆదేశించారు. కార్యకర్తలను నారాజ్ చేయవద్దని సూచించారు. మంగళవారం గాంధీ భవన్ లో జరిగిన పీసీసీ (PAC meeting) రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. మంత్రి పదవుల కోసం ధర్నాలు చేయించడం ఏంటి? పదవులు అడగడం తప్పు లేదు. కానీ ఇవాళ ఒకరు ధర్నా చేశారని రేపు ఇంకొకరు ధర్నా చేస్తారు. ఇది పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి దారితీస్తుందని మండిపడ్డారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం అని హెచ్చరించారు. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలని హితవు పలికారు.






