- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిషన్ రెడ్డికి కేటీఆర్ ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్.. CM రేవంత్ హాట్ కామెంట్స్
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. ఢిల్లీలో ఇవాళ మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేటీఆర్(KTR)కు కిషన్ రెడ్డి లైజనింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్(BRS) ఆర్గాన్ డొనేషన్ చేసింది కాబట్టే.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలిచిందని అన్నారు. కిషన్ రెడ్డికి కేటీఆర్ ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కోసం బీజేపీ, బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేస్తున్నాయని.. ఇప్పుడు ఇద్దరి బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ బంధమే మెదక్‌లో బీఆర్ఎస్‌ను ఓడించిందని అయినా.. బుద్ధి రావడం లేదని అన్నారు. అంతకుముందు బనకచర్ల ప్రాజెక్ట్‌పైనా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో కూర్చుని మాట్లాడుకుంటే ఏ వివాదం ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎఫ్ఆర్ ఇవ్వడం వల్లే వివాదం మొదలైందని, ఏపీ పీఎఫ్ఆర్ ఇచ్చిన వెంటనే కేంద్రం కూడా స్పందిస్తోందన్నారు.






