ఈ రోజు రాత్రి మరోసారి ఢిల్లీకి CM రేవంత్‌ రెడ్డి.. అసలు విషయం ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-01 06:16:29  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ రాత్రి మరోసారి హస్తినకు వెళ్లనున్నారు.

ఈ రోజు రాత్రి మరోసారి ఢిల్లీకి CM రేవంత్‌ రెడ్డి.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ రాత్రి మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. ఈ మేరకు రేపు ఆయన విజ్ఞాన్ భవన్‌లో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) లా, హ్యూమన్ రైట్స్ అండ్ RTI విభాగం-2025 ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న న్యాయ విభాగం కాంక్లేవ్‌లో పాల్గొనబోతున్నారు. ‘రాజ్యాంగ సవాళ్లు-దృక్పథం, మార్గాలు’ అనే థీమ్‌తో సదస్సు కొనసాగనుంది. భారత రాజ్యాంగంలో నీతి, పరిణామ పాత్రపై న్యాయ నిపుణులు, విద్వాంసులు, విద్యార్థులు చర్చలో భాగస్వాములు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. సుమారు 1,200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్న ఈ కాంక్లేవ్‌కు నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story