TG: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త

by Gantepaka Srikanth |
TG: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతు(Telangana Farmers)లకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభవార్త చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా(Rythu Bharosa) నిధులు వేస్తామని హామీ ఇచ్చారు. శనివారం నల్లగొండ జిల్లాలోని గంధంవారిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. రైతులు సన్నవడ్లు పండించాలని సూచించారు. ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత ఎవరు అడ్డుపడినా రైతుభరోసా ఇచ్చి తీరుతామని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఒక్క సంవత్సరంలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? అని అడిగారు.

జరిగిందని నిరూపిస్తే మంత్రివర్గంతో కలిసి క్షమాపణ చెబుతామని కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. ఒకే ఒక్క ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలపై మాట్లాడే హక్కు, అర్హత బీఆర్ఎస్, బీజేపీ నేతలకు లేదని మండిపడ్డారు. ఎస్‌ఎల్‌బీసీ(SLBC) టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమయ్యేది అని అన్నారు. కేసీఆర్‌ నిర్లక్ష్యం కారణంగా నల్గొండ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. అధికారంలో ఉంటే పాలన, లేదంటే ఫాంహౌస్‌కు పరిమితం కావడం కేసీఆర్ నైజం అని అన్నారు. ఒక రాజకీయ నాయకుడికి ఇలాంటి వ్యవహార శైలి సరికాదు.. గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉండాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed