- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.. ఏకంగా 9 పేజీల లేఖ
కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ పాలిటిక్స్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య మధ్య పరస్పర విమర్శల జోరు పెరుగుతున్నది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ 9 పేజీలతో కూడిన లేఖలో (letter) రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం కిషన్ రెడ్డి బాధ్యత అన్నారు. రాష్ట్రాలకు ప్రాజెక్టుల మంజూరులో కేంద్రానికి ఒక విధానం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ నిన్న కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు లేఖ రూపంలో సీఎం కౌంటర్ ఇచ్చారు. ‘కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీ వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్యం అన్నారు. మెట్రో ఫేజ్ 2, ఆర్ఆర్ఆర్, మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్టు నుంచి ఏపీలోని బందర్ సీ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతులు, హైదరాబాద్ సివరేజ్, వరంగల్ అండర్ గ్రౌండ్ సివరేజ్ వంటి పలు ప్రాజెక్టుల కోసం ఎన్ని సార్లు కేంద్ర మంత్రులను (Union Ministers), అధికారులను కలిసినా ఉపయోగం లేదు. మేము సిస్టం ఫాలో అయ్యాం. కానీ కేంద్రమే పక్కన పెట్టింది’ అంటూ సీఎం ఘాటు విమర్శలు చేశారు.
కిషన్ రెడ్డి ఎందుకు విషం చిమ్ముతున్నారు?:
కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో (Metro) విస్తరణకు ఆమోదం లభించింది. కానీ హైదరాబాద్ మెట్రోపై (Musi project) మాత్రం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పురోగతి లేదు. మూసీపై ఎందుకు విషం చిమ్ముతున్నారు? అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం ఏడాది కాలంగా మేము కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ప్రధానమంత్రితో పాటు తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్న మీకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం అని తేదీలతో సహా లేఖలో సీఎం వివరాలు పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి మీరు కొనసాగుతున్నారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు మంజూరు చేయించాలని కోరాము. ఇదే విషయాన్ని నేను ప్రస్తా విస్తే ముఖ్యమంత్రి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని, మమ్మల్ని అడిగే హామీలు ఇచ్చారా అంటూ విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులను కలవడం, ఆయా శాఖలు అడిగిన వివరాలు అందజేయడం ప్రధానమంత్రిని (PM Modi) కలిసి అందజేయడంతో పాటు మిమ్మల్ని స్వయంగా కలిసి అన్నీ వివరించిన తర్వాత కూడా మాపై విమర్శలు చేయడం తీవ్ర అభ్యంతరకరం. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఉన్న మీరు తెలంగాణ ప్రజలకు చేసిందేమిటో తెలియజేయండి. కేంద్ర మంత్రిగా ఉండి ఏ ఒక్కటీ సాధించలేని మీరు ఒత్తిడితో మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందకు ఎదురుదాడి చేయడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ఇకైనా మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రూ. 1,63,559.31 కోట్ల ప్రాజెక్టుల అనుమతులు, నిధుల మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.






