పార్టీలో నేనూ వ్యతిరేక ఎదుర్కొన్న.. డీసీసీ శిక్షణ శిబిరంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

డీసీసీగా లభించిన అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం అన్నారు. డీసీసీ శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

పార్టీలో నేనూ వ్యతిరేక ఎదుర్కొన్న.. డీసీసీ శిక్షణ శిబిరంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో అందరి పని తీరు మీద నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్నవారికి పార్టీలో కచ్చితంగా న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డీసీసీ పదవి ఎంతో విలువైనదని వచ్చిన అవకాశం దుర్వినయోగం చేసుకోవద్దని సూచించారు. ఇవాళ వికారాబాద్‍లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతులలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. వారసత్వంగా అవకాశాలు ఎవరికీ రావని మనం చేసిన కష్టం, శ్రమ ఎప్పటికీ వృథాగా పోదన్నారు. శిక్షణను శిక్షగా భావించవద్దన్నారు. డీసీసీలుగా పార్టీ మమ్మల్నీ ఎన్నుకున్నది కాబట్టి ఈ జిల్లాపై మాదే ఆధిపత్యం మేమే అధిపతులం అని ఎవరైనా భావిస్తే అది మీరు చేసే మొదటి తప్పిదం అవుతుందన్నారు. డీసీసీ పోస్టు అనేది అధికారం కాదని ఇది కుటుంబ పెద్ద లాంటి బాధ్యత అన్నారు. పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారు ఉంటారన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో కొత్తేం కాదని మహాత్మాగాంధీ నాటి నుండి కొనసాగుతోందని దీన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంతే తప్ప మనల్నీ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అలాంటి వారిన పార్టీ నుంచి బయటకు తరిమేయాలని చూస్తే మీరు పార్టీకి కీడు చేసినవారవుతారన్నారు.

నేను వ్యతిరేకత ఎదుర్కొన్న:

నేను పీసీసీ చీఫ్‍గా అయ్యేనాటికి పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉండేదని పార్టీలోనూ కొందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నానని చెప్పారు. కానీ నేతలందరీ ఇళ్లకు వెళ్లి వారిని కలిశాను.మీకంటే వయసులో,అనుభవంలో చిన్నవాడినే కావచ్చు. కానీ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది నాకు సహకరించాలని నా ఆలోచనలు వారికి చెప్పి అందరినీ ఒప్పించాను. అందరం సమిష్టిగా కృషి చేయడంతో పార్టీ ఓటింగ్ 2.5 శాతం నుంచి 40 శాతానికి చేరిందన్నారు. డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చామని ఎమ్మెల్యే టికెట్లు పొందని వారికి ఎమ్మెల్సీగా ఇచ్చామన్నారు. పార్టీ కోసం కృషి చేసిన మరో 60 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామన్నారు.

Next Story