- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శాసనసభలో కీలక ప్రకటన చేశారు. కులగణన (Caste Census) సర్వేపై శాసనసభలో (Assembly) జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు (42% Reservation) ఇవ్వాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. కానీ అలా అవకాశం లేకపోతే పార్టీ పరంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తుందని ఈ వేదిక నుంచి నేను మాటిస్తున్నానన్నారు. ఈ విషయంలో నేను పీసీసీ అధ్యక్షుడి మాట తీసుకునే ఈ సభకు వచ్చానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) 42 శాతం సీట్లు బీసీలకు ఇస్తుంది ఇది మా కమిట్మెంట్ మరి బీఆర్ఎస్(BRS) , బీజేపీ (BJP) ఇస్తుందా అని ప్రశ్నించారు. చట్టబద్ధం అవకాశం వచ్చినప్పుడు ఇద్దాం. కానీ రాజకీయంగా, నైతికంగా కట్టుబడి 42 శాతం సీట్లు బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం ఇందుకు ఈ మీ రెండు పార్టీలు సిద్ధమా అసెంబ్లీ వేదికగా చెప్పాలని చాలెంజ్ చేస్తున్నానన్నారు.






