TANA: తానా సభలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం.. అమెరికాలో జులై 3 నుంచి తానా కాన్ఫరెన్స్

by Ramesh Naini |   (  Updated:2025-03-24 08:04:53  IST  )

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలు ఈ ఏడాది జులై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవిలోని సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌లో నిర్వహించనున్నారు.

TANA: తానా సభలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం.. అమెరికాలో జులై 3 నుంచి తానా కాన్ఫరెన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలు ఈ ఏడాది జులై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవిలోని సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే తానా 24వ కాన్ఫరెన్స్‌కు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానా ప్రతినిధులు ఆహ్వానించారు. సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. సీఎంని కలిసిన వారిలో తానా కాన్ఫరెన్స్‌ చైర్మన్ నాదెళ్ల గంగాధర్‌, మాజీ అధ్యక్షుడు జయరామ్‌ కోమటి, కాన్ఫరెన్స్‌ డైరెక్టర్‌ సునీల్‌ పాంట్ర, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడి ఉన్నారు. కాగా, తానా ( Telugu Association Of North America) అమెరికాలో అతిపెద్ద తెలుగు సంస్థగా ఉంటూ తెలుగు సమాజానికి ఎనలేని సేవలందిస్తోంది. తానా 24వ కాన్ఫరెన్స్‌కు కేంద్ర మంత్రులు, ఎంపీలకు సైతం అహ్వానపత్రికలు అందించారు.

Next Story