ఐనవోలు బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే?.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

by Ramesh Naini |

హనుమకొండ జిల్లా ప్రఖ్యాత ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయ ప్రతినిధులు ఆహ్వానించారు.

ఐనవోలు బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే?.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హనుమకొండ జిల్లా ప్రఖ్యాత ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయ ప్రతినిధులు ఆహ్వానించారు. సోమవారం అసెంబ్లీ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆలయ పూజారులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

ఈ సందర్భంగా ఆలయ పూజారులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు.

Next Story