Alai Balai Program: ‘అలయ్ బలయ్’ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందజేసిన దత్తాత్రేయ

by Ramesh Naini |   (  Updated:2025-09-14 13:03:18  IST  )

జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆదివారం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు.

Alai Balai Program: ‘అలయ్ బలయ్’ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందజేసిన దత్తాత్రేయ
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఆదివారం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatraya) మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 3న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే (Alai Balai) “అలయ్ బలయ్” కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని దత్తాత్రేయ ఆహ్వానించారు. ఈ మేరకు సీఎంకు ఆహ్వాన పత్రికను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయను సీఎం రేవంత్ శాలువా కప్పి సత్కరించారు. కాగా, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహిస్తారు. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ వేడుకలు ప్రతీ ఏడాది దసరా సమయంలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు, అధికారులు, సెలబ్రిటీలు, ప్రముఖులు పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాలకు అతీతంగా నాయకులను ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో 2005‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్న ప్రారంభించిన విషయం విదితమే.

Next Story