- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు సంగారెడ్డిలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా(Sangareddy District) ఝరాసంగం మండలం మచునూరు(Machunuru)లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ(Kendriya Vidyalaya) నూతన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. భవన ప్రాంగణంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల మీ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాలయమని చెబుతూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు విద్యార్థుల వద్దకెళ్లి వారితో కరచాలనం చేస్తూ వెన్నుతట్టారు. కొద్దిసేపు వారితో ముచ్చటిస్తూ వారి వివరాలు, హాబీలు అడిగి తెల్సుకున్నారు.
Next Story






