రెండేళ్లలో SLBC పూర్తి చేస్తాం: CM రేవంత్ రెడ్డి

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-03 10:45:12  IST  )

నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల ప్రజానీకానికి తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ పనులను రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రెండేళ్లలో SLBC పూర్తి చేస్తాం: CM రేవంత్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/అచ్చంపేట: నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల ప్రజానీకానికి తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ పనులను రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరంతరాయంగా సాగుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం కూలి.. 8 మంది సజీవ సమాధి అయినా నేపథ్యంలో నిలిచిపోయిన పనులను చేపట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, దేవరకొండ ఎమ్మెల్యే వాళ్లు నాయక్ తదితరులతో కలిసి టన్నెల్‌ను పూర్తి చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి హెలి మాగ్నెటిక్ సర్వే వివరాలను నిపుణులతో కలిసి పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

1983లో మంజూరు అయిన ఎస్ఎల్బీసీ 2004- 05 సంవత్సరాలలో రెండువేల కోట్ల అంచనాలతో పనులు ప్రారంభం అయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ ప్రాజెక్టును పూర్తి చెయ్యలేదు అని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, హరీష్ రావు పాలమూరు, నల్గొండ జిల్లాలకు తీరని అన్యాయం చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. 42 కిలోమీటర్లు ఉన్న ఎస్ఎల్బీసీ ఇంకా 9.8 కిలోమీటర్ల పొడవున్న పొడవున టన్నెల్ పనులను కొనసాగించే క్రమంలో టన్నెల్‌లో కూలిపోవడంతో పనులు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ పనులను పూర్తి చేయాలి అన్న ఉద్దేశంతో అత్యాధునిక ఏరియల్ ఎలక్ట్రో మాగ్నెటిక్ ద్వారా సర్వే చేయిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 800 మీటర్ల నుండి 1000 మీటర్ల లోపల వరకు ఉన్న పరిస్థితులను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది అన్నారు.

ఎస్ఎల్బీసీకి 4600 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ విధులతోనే పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిలో 811 పీఎంసీల నికర జలాలలో 512 టీఎంసీల నికర జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించి.. మనకు మాత్రం 299 టీఎంసీలు చాలు అని ఒప్పందం కుదుర్చుకున్నారు. పైగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన ఒక్క ప్రాజెక్టు పనిని కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు మనము పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తుంది అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎంపికైన నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నల్గొండ జిల్లా నుండి ఎంపికైన ఉత్తమ్ కుమార్, కోటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోకుంటే మమ్మల్ని ప్రజలు క్షమించరు. ఇప్పుడు చేసుకోకుంటే ఎప్పటికీ చేయలేము. ఎవరు అడ్డు వచ్చినా ప్రాజెక్టులను పూర్తిచేసే తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

READ MORE ...

SLBC ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే.. పరిశీలనకు బయలుదేరిన సీఎం, మంత్రులు

Next Story