- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన CM రేవంత్
తెలంగాణలో హైడ్రా పోలీస్ స్టేషన్(Hydra Police Station) ఏర్పాటైంది. మంత్రులు, అధికారులతో కలిసి గురువారం బుద్ధ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో హైడ్రా పోలీస్ స్టేషన్(Hydra Police Station) ఏర్పాటైంది. మంత్రులు, అధికారులతో కలిసి గురువారం బుద్ధ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. కాగా, రాష్ట్రంలో భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని పరిధిని మరింత విస్తరించేలా ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్టేషన్‌కు ఏసీపీ తిరుమల్ ఎస్‌హెచ్‌వోగా వ్యవహరించనున్నారు. 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ స్టేషన్‌లో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారు. హైడ్రాకు 70 వాహనాలను ప్రభుత్వం అందజేసింది. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.






