CM Revanth Reddy: మీది ఇన్నోవేటివ్‌ కంపెనీ.. మాది ఇన్నోవేటివ్‌ ప్రభుత్వం.. గూగుల్ జీఎస్‌ఈసీ ఓపెనింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

గూగుల్ జీఎస్‌ఈసీ ఓపెనింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి కీల వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy: మీది ఇన్నోవేటివ్‌ కంపెనీ.. మాది ఇన్నోవేటివ్‌ ప్రభుత్వం.. గూగుల్ జీఎస్‌ఈసీ ఓపెనింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి
X

తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ.. మాది ఇన్నోవేటివ్ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతం.. ఈ విధానాన్ని నేను ఇష్టపడుతున్నాననని అన్నారు. గూగుల్ లాగా, నా ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయని కానీ మనం దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి పని చేయాలన్నారు. ఇవాళ హైదరాబాద్ లో గూగుల్ సేప్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ) ( Google GSEC) ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం ప్రభారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఇది ప్రపంచంలో ఐదవది మాత్రమేనన్నారు.

డిజిటల్‌ సమాచారం భద్రంగా ఉండాలి..

గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందని సీఎం అన్నారు. నేడు, మన జీవితాలు పూర్తిగా డిజిటల్ మారాయి. మనం గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్ గా మారాయి. డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్లు అని మనం మరింత అభివృద్ధి చెందుతామని అన్నారు. అధునాతన సైబర్ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్-సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు నేను గర్విస్తున్నానన్నారు. ఈ కేంద్రం నైపుణ్య అభివృద్ధి పై దృష్టి పెట్టడం ఉపాధిని సృష్టించి దేశం సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. నైపుణ్యాల పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. ఉత్తమ పెట్టుబడులుకు గమ్యస్థానంగా తెలంగాణ మారబోతున్నదని చెప్పారు. 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ మారబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.

గూగుల్, హైదరాబాద్ పాత స్నేహితులు:

తెలంగాణ రైజింగ్ లో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులాగ మారుస్తున్నామని సీఎం చెప్పారు. గూగుల్ ఆఫీస్ పక్క ని రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశాం. మేము మా రైతులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉంచడం.. మా యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు వారికి ఉపాధి కల్పించాలనుకుంటున్నట్లు సీఎం చెప్పారు. వీటన్నిటికీ నాకు మీ మద్దతు అవసరం అన్నారు. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్నానని గూగుల్, హైదరాబాద్ పాత స్నేహితులు అన్నారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. దాదాపు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్‌ను తమ ఇల్లుగా భావిస్తున్నారన్నారు. విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, ఆరోగ్యం ఇలా అనేక రంగాలలో గూగుల్ తో కలిసి మేం పనిచేస్తున్నామని చెప్పారు. గూగుల్ లాగానే, నా ప్రభుత్వంలో భాగస్వాములైన మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకుంటున్నాను. మనం కలిసి గొప్ప ప్రమాణాలను సృష్టిద్దాం. హైదరాబాద్ లో మీ కొత్త సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మరోసారి అభినందిస్తున్నాను. మేం గర్వపడేలా మీరు పనిచేస్తారని విశ్వసిస్తున్నాను.

జీహెచ్ఎంసీలోను వివిధ పనుల కోసం ట్రాన్స్ జెండర్లు:

గత ప్రభుత్వాలు ట్రాన్సజెండర్స్ ని నిర్లక్ష్యం చేస్తే మా ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమించామన్నారు. జీహెచ్ఎంసీ కూడా వివిధ పనుల కోసం ట్రాన్స్ జెండర్ లను నియమించుకుంటోందని చెప్పారు. నాణ్యమైన విద్య మా లక్ష్యం అని ఇందుకోసం యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను తీసుకువస్తున్నామన్నారు. విద్యార్థులకు నైపుణ్యం ఉండడం లేదని అందుకో ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.

Next Story