- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా విలేజ్ లతో 5 లక్షల ఉద్యోగాలు: సీఎం రేవంత్ రెడ్డి
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా విలేజ్ లు డెవలప్ చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్మా రంగం అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నామన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. మేజర్ ఫార్మా కంపెనీలు, హెల్త్ కేర్ సంస్థలు, లైఫ్ సైన్సెస్ అండ్ బయో టెక్ కంపెనీలు హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయని విదేశీ వర్సిటీల నిపుణులు, ఫార్మా రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. మంగళవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో (HICC) బయో ఆసియా-2025 సదస్సును (Bio Asia 2025 Conference) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ గా మారుతుందనడానికి ఈ బయో ఆసియా సదస్సు ఉదాహరణ అని సీఎం అన్నారు. ఈ సదస్సు హెల్త్ కేర్ రంగంలో ప్రపంచంలో భారతదేశాన్ని ముఖ్యమైన స్థానంలో ఉంచేందుకు దోహదపడుతుందన్నారు. ఏఐ, క్వాంటమ్, రోబొటిక్స్ సాయంతో వైద్యరంగం రూపులేఖలు మారుతున్నాయని, తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే పదేళ్లలో 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనేది మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ మౌలిక వవసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీతో పాటు అనేక భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ కు మధ్య ఫార్మా విలేజ్ లు (Pharma Village) డెవలప్ చేస్తామని దీని ద్వారా దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు.
పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ నం.1:
గత సంవత్సరం లైఫ్ సైన్సెస్ సెక్టర్‌లో 40 వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించామని ఇందులో దాదాపు 150 ప్రాజెక్టులు ఉన్నాయని సీఎం చెప్పారు. ద్రవ్యోల్బణం ఏర్పడకుండా అధికంగా ఉద్యోగాలు సృష్టిస్తున్నామని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక లో తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. దేశీయంగా, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ నం.1 గా ఉందన్నారు. దేశంలోనే అత్యధిక ఈవీ వాహనాల విక్రయాలతో హైదరాబాద్ ప్రస్తుతం ఈవీ కెపిటల్ ఆఫ్ ఇండియాగా అవతరించింది. మొబిలిటీతో పాటు, పర్యావరణ అనుకూల వ్యవస్థలు అవసరం. అందుకే జీహెచ్ఎంసీ పరిధిలో 3 వేల ఎలక్ట్రిక్ బుస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో డ్రైపోర్టును నిర్మిస్తున్నాం. తీరప్రాతం లేని లోటును పూడ్చేందుకు డ్రైపోర్టుకు సమీపంగా సమీపంగా ఉన్న ఏపీలోని సీపోర్టుకు ప్రత్యేకంగా రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. విద్యారంగ అభివృద్ధికి పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నాం. యువతలో స్పెషల్ ఫోకస్ పెట్టాం. నిన్న అమెజాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ జరిగింది. దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు రావడానికి ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
జినోమ్ వ్యాలీ ద్వారా 51,000 జాబ్స్: మంత్రి శ్రీధర్‌బాబు
మా ప్రభుత్వం వచ్చాక అనేక సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయని పరిశోధనలు, భాగస్వామ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) చెప్పారు బయో ఆసియా-2025 సదస్సులో మాట్లాడిన ఆయన గత సంవత్సరం కాలంగా ఎన్నో గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని జినోమ్ వ్యాలీ ద్వారా 51,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షా యాభై వేల మంది పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు. తెలంగాణ 2.0 కోసం 15 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో మార్గాలు, డేటా సెంటర్లు వంటివి నిర్మిస్తున్నామన్నారు.
50 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు:
సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలకు ఉద్దేశించిన అంతర్జాతీయ వేదిక బయో ఆసియా-2025 సదస్సు ఇవాళ రేపు జరగనున్నది. ఈ సదస్సులో 50 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. లైఫ్ సైన్సెస్ లో ఆధునిక మార్పులు, పురోగతిపై చర్చించనున్నారు. క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్.. ఎక్స్ పాండింగ్ గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రాంటీయర్స్ థీమ్ తో ఈ సదస్సు జరుగుతోంది. ఏఐతో వచ్చిన మార్పులపై పరిశోధనే ఎజెండాగా లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ మోడల్స్ పై చర్చించనున్నారు.






